Darling Swamy: ‘డార్లింగ్’ షూటింగ్ సమయంలో ప్రభాస్ చేసిన పనికి యూనిట్ అంతా షాక్!

by Pulgam srinivas |   (  Updated:2026-05-27 06:39:38  IST  )

డార్లింగ్ స్వామి మాట్లాడుతూ.. “‘డార్లింగ్’ షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లాం. ఆ సమయంలో డిసెంబర్ 31 నైట్ వచ్చింది. దాంతో ప్రభాస్ గారు సినిమా కోసం పనిచేస్తున్న వారికి 5000 భాట్స్ ఇచ్చి ఆ రోజు సరదాగా ఎంజాయ్ చేయమని చెప్పారు” అంటూ అప్పటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

Darling Swamy: ‘డార్లింగ్’ షూటింగ్ సమయంలో ప్రభాస్ చేసిన పనికి యూనిట్ అంతా షాక్!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ప్రభాస్‌తో ప్రముఖ రైటర్ డార్లింగ్ స్వామికి మంచి అనుబంధం ఉంది. ప్రభాస్ హీరోగా నటించిన పలు సినిమాలకు ఆయన పని చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డార్లింగ్ స్వామి, ‘డార్లింగ్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. డార్లింగ్ స్వామి మాట్లాడుతూ.. “ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘డార్లింగ్’ సినిమా షూటింగ్ కోసం మేమంతా బ్యాంకాక్ వెళ్లాం. షూటింగ్ జరుగుతున్న సమయంలో డిసెంబర్ 31 నైట్ వచ్చింది. ఆ సందర్భంగా ప్రభాస్ గారు సినిమా కోసం పనిచేస్తున్న టెక్నీషియన్స్, వర్కర్స్‌ను ఒక్కొక్కరిని పిలిచి ప్రతి ఒక్కరికి 5000 భాట్స్ ఇచ్చి ఆ రోజు సరదాగా ఎంజాయ్ చేయమని పంపించారు.

ప్రభాస్ వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన మాత్రమే ఎంజాయ్ చేయాలని ఎప్పుడూ అనుకోరు. తనతో ఉన్నవారు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు అంటూ ప్రభాస్ గొప్ప మనసును ప్రశంసించారు. ఇక కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డార్లింగ్’ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ మూవీని రీ-రిలీజ్ చేయగా అప్పుడూ అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రభాస్ స్పిరిట్ షూట్

Next Story