పదో తరగతి విద్యార్థులకు టీశాట్ ద్వారా ప్రత్యేక శిక్షణ

by Malleboina Mahesh |

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) కీలక నిర్ణయం తీసుకుంది.

పదో తరగతి విద్యార్థులకు టీశాట్ ద్వారా ప్రత్యేక శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, సబ్జెక్టులపై అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీశాట్ వేదికగా ప్రత్యేక మార్గదర్శక తరగతులను నిర్వహించనుంది. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు నిపుణులచే సూచనలు అందిస్తారు. మార్చి 14 నుండి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రోత్సహించడం, సందేహాలను నివృత్తి చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.

సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ రూపొందించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా తగిన ఏర్పాట్లు చేయాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ఐఎఫ్పీ స్క్రీన్లను ఇందుకోసం వినియోగించుకోవాలని సూచించారు. సబ్జెక్టు నిపుణులు విద్యార్థులకు పరీక్షా టిప్స్, విలువైన సలహాలు అందించనున్నారు.

సబ్జెక్టుల వారీగా షెడ్యూల్:

తేదీ -ఉదయం (9.30 నుండి 12.30)- మధ్యాహ్నం (1.30 నుండి 4.30)

ఫిబ్రవరి 3- ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ - ఇంగ్లీష్, హిందీ/గణితం

ఫిబ్రవరి 4-గణితం, తెలుగు - సోషల్ స్టడీస్,ఉర్దూ

ఫిబ్రవరి 5- గణితం, ఫిజికల్ సైన్స్ - బయోలాజికల్ సైన్స్, సోషల్

Next Story