- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరిహద్దు ప్రాంతాల్లో నేరాల నియంత్రణపై ప్రత్యేక నిఘా
సరిహద్దు ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ రెడ్డి కోరారు.

దిశ, శేరిలింగంపల్లి : సరిహద్దు ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ రెడ్డి కోరారు. ఈ సమావేశానికి సైబరాబాద్, హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ, సంగారెడ్డి, మెదక్ తదితర సరిహద్దు కమిషనరేట్లు, జిల్లాల పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో జరిగే నేరాలను అరికట్టడంలో పోలీసు శాఖల మధ్య సమన్వయం, వేగవంతమైన సమాచార మార్పిడి, సంయుక్త కార్యాచరణ అత్యంత కీలకమని అన్నారు. ఒక కమిషనరేట్ లేదా జిల్లా పరిధిలో నేరానికి పాల్పడి మరో ప్రాంతానికి పారిపోయే నేరస్థులను గుర్తించి, త్వరితగతిన పట్టుకోవడానికి పరస్పర సహకారం అవసరమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ నెట్‌వర్క్, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.
రౌడీ షీటర్లు, చరిత్ర కలిగిన నేరస్తులు, అంతర్‌రాష్ట్ర ముఠాలు, సైబర్ నేరస్థులపై నిరంతర నిఘా కొనసాగించాలని, నేరం జరిగిన వెంటనే సమాచారం అందిపుచ్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్ తదితర విభాగాల పనితీరును సమగ్రంగా సమీక్షించారు. ఆయా విభాగాల అధికారులు తమ పరిధిలోని ప్రస్తుత పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లు, నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, పరస్పర సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చి, కార్యాచరణ ప్రణాళికలు, అమలు వ్యూహాలను సమావేశంలో వివరించారు.
రౌడీ షీటర్లు, అంతర్‌రాష్ట్ర ముఠాల కదలికలపై సమాచార మార్పిడి, సంయుక్త చెక్‌పోస్టులు, పెట్రోలింగ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా తక్షణ సమాచార మార్పిడి, మిస్సింగ్ వ్యక్తులు, గుర్తుతెలియని మృతదేహాల వివరాల మార్పిడి, సీసీటీవీ కవరేజ్ విస్తరణ, సైబర్ నేరాలపై సమన్వయం, వీఐపీ బందోబస్తు, మతపరమైన పండుగలు, భారీ కార్యక్రమాల సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ, సామాజిక ఉద్రిక్తతల నివారణ, సహజ విపత్తుల సమయంలో సంయుక్త చర్యలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్, హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డావిస్, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి, శేరిలింగంపల్లి డీసీపీ సి.హెచ్. శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీ ఐ. శేషాద్రిని రెడ్డి, డీసీపీ (క్రైమ్స్) ముత్యం రెడ్డి, డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) వై.వి.ఎస్. సుధీంద్ర, డీసీపీ (మహిళా, శిశు భద్రత విభాగం) సృజన కరణం, డీసీపీ (సైబర్ క్రైమ్స్) పుష్ప, ఎస్‌వోటీ డీసీపీ శోభన్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ–2 రవికుమార్ పాల్గొన్నారు.






