- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవేం 'పర్మిట్' రూంలు..?
దిశ, పరిగి: పరిగిలో పర్మిట్‌రూంలు బార్ లను మించి పోతున్నాయి. మందుబాబులు..Special Story On liquor permit rooms

దిశ, పరిగి: పరిగిలో పర్మిట్‌రూంలు బార్ లను మించి పోతున్నాయి. మందుబాబులు కూడా పర్మిట్ రూంలలో గంటలు గంటలు మద్యం తాగుతూ కూర్చుంటూ చివరకు కుర్చీల కోసం తలలు పగలగొట్టుకొని వీరంగం సృష్టిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనికంతటికీ కారణం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమేనని మున్సిపల్ప్రజలు ఆరోపిస్తున్నారు. పరిగిలో పర్మిట్ రూంలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఎక్సైజ్ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా మమాళ్ల మత్తులో జోగుతూ పెడచెవిన పెట్టడం వల్లే పర్మిట్‌రూంలో తాగడమే కాకుండా తన్నుకునేంత వరకు పరిస్థితులు వెళ్తున్నాయి. తాజాగా పరిగిలోని ఓ పర్మిట్‌రూంలో గొడవ ప్రాణాల మీదకే వచ్చినా ఎక్సైజ్అధికారులకు మాత్రం కనువిప్పుకలుగడంలేదని మండిపడుతున్నారు. పూటుగా తాగేందుకు వీలుగా కుర్చీలు వేయడం, కూర్చునేందు కుర్చీ కోసమే తాగే బీరు బాటిల్, కట్టెలతోతలపై కొట్టి పగలగొట్టుకున్నారు.
పర్మిట్ రూం ముందు బార్.. బలా దూర్
పరిగి మున్సిపల్ లో ఏడు వైన్స్‌షాప్ లకుగాను ఏడు పర్మిట్‌రూంలు ఉన్నాయి. ఏడు పర్మిట్‌రూంలు నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారు. కేవలం 100 చదరపు గజాల స్థలంలో స్టాండింగ్ లోనే చిన్నపాటి స్టాండ్ పై మద్యం బాటిల్, గ్లాసు పెట్టుకునేందుకు వీలుగా ఉండాలి. అంతేకాకుండా ఈ పర్మిట్ రూంలలో కేవలం వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ మాత్రమే విక్రయించాలి. కానీ పరిగిలోని పర్మిట్ రూంలలో 100 మందికిపైగా ఒకేసారి సిట్టింగ్చేసేలా కొన్ని పర్మిట్రూంను సెట్టింగ్చేశారు. అంతేకాకుండా వేంచిన పల్లీల నుంచి మేక తలకాయ కూర వరకు అన్నీ చికెన్, మటన్, బోటీ ఈ పర్మిట్ రూంలలో వండే సౌకర్యాన్ని ఏర్పాటు చేశేసుకున్నారు. కేవలం పేరుకే పర్మిట్ రూంలు పరిగిలో బార్ ఉన్నా పర్మిట్ రూమ్ ల ముందు బార్బలాదూర్అన్నట్లుగా నడుస్తున్నాయి. ఎక్సైజ్ కనుసన్నల్లో ఈ పర్మిట్ రూంలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని మున్సిపల్ప్రజలు ఆరోపిస్తున్నారు. పర్మిట్ రూం ఏర్పాటు చేసే సమయంలో అనుమతి కోసం పొడవు, వెడల్పుతో కూడిన మ్యాప్ ఎక్సైజ్‌శాఖ ఈఎస్‌కు సమర్పించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదంటే ఆంత్యర్యమేమిటోనంటూ తప్పుపడుతున్నారు.
హైవే పక్కనే పర్మిట్ రూం.. హైవే రోడ్డు పైనే వాహనాల పార్కింగ్
పరిగిలోని పర్మిట్‌రూంల వద్ద పార్మింగ్సౌకర్యం లేకపోవడంతో రోడ్డుపైనే వాహనాలను పార్మింగ్చేసి మందు బాబులు మద్యం సేవిస్తున్నారు. దీంతో హైవేపై ప్రయాణించే ప్రయాణికులకుతోపాటు పాదచారులకు ఇబ్బందిగా మారింది. పరిగి మున్సిపల్ లో వేలాదిగా వాహనదారులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఆపై హైవే రోడ్డుపై వెళ్లే వాహనదారులతోపాదచారులకు ఇబ్బందిగా మారింది. పరిగి బస్టాండ్, బాహర్పేట్ చౌరస్తా, షాద్‌నగర్ రోడ్డులో పర్మిట్ రూంలకు వచ్చే మద్యం ప్రియులు రోడ్డుపైనే పార్కింగ్చేస్తున్నారు. హైవేతోపాటు ఈ రోడ్డులో వెళ్లే వాహనదారులు, పాదచారులకు పర్మిట్‌రూంలకు వచ్చే పార్కింగ్ తో ఇబ్బందిగా మారింది. ప్రమాదాలు జరగకముందే ఎక్సైజ్, పోలీసులు అధికారులు స్పందించి రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పర్మిట్రూంలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ప్రజలు కోరుతున్నారు. కనీసం పాలకులైనా పట్టించుకుని అధికారులతో నిబంధనలకు విరుద్ధంగా ఉండి, తలలు పగలగొట్టుకునేందుకు కారణమవుతున్న పర్మిట్ రూంలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. మరికొందరైతే రాజకీయనాకుల సిండికేట్ వైన్స్లని, పర్మిట్‌రూంలు కూడా వారికి సంబంధించినవి కాబట్టే అధికారులు మామూళ్లు తీసుకుంటూ మమ అంటూ చేతులు దులుపుకుంటున్నారంటూ అనుకుంటున్నారు.






