'ఆర్ఆర్ఆర్' అప్‌డేట్.. ప్లాన్ అంతా క్యాన్సిల్..?

by Dishafeatures2 |
ఆర్ఆర్ఆర్ అప్‌డేట్.. ప్లాన్ అంతా క్యాన్సిల్..?
X

దిశ, వెబ్‌డెస్క్: మరికొన్ని రోజుల్లోనే మోస్ట్ ఎవెయిటెడ్ సినిమా 'ఆర్ఆర్ఆర్' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ టైంలో 'ఆర్ఆర్ఆర్' గురించి ఓ ఇంటరెస్టింగ్ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పక్కాగా చేసుకున్న రాజమౌళి ప్లాన్ క్యాన్సిల్ అయిందట. 'ఆర్ఆర్ఆర్' మూవీ రిలీజ్ సందర్భంగా మూవీ టీం భారీగా ప్రమోషన్స్ చేస్తోంది. చాలా స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా టీం ఇచ్చింది. వీటిలో చెర్రి, ఎన్‌టీఆర్‌ను సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేశారు.

అయితే వీరే కాకుండా 'ఆర్ఆర్ఆర్' స్టార్స్ ఇద్దరినీ మరో స్టార్ హీరో కూడా ఇంటర్వ్యూ చేయాల్సి ఉందట. అదెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. వీరు ముగ్గురు ఇప్పటికే మంచి స్నేహితులు. మహేష్‌తో కలిసి చెర్రి ఓవర్సీస్‌కు ట్రిప్‌కు కూడా వెళ్లాడు. కాబట్టి వీరంతా ఇంటర్వ్యూలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జెన్యూన్‌గా ఉండొచ్చని ప్లాన్ చేశారట. కానీ కొన్ని అనివార్య కారణాల కారణంగా ఈ ఇంటర్వ్యూ ఆగిపోయిందని నెట్టింట టాక్ నడుస్తోంది. అంతేకాకుండా రాజమౌళి నెక్స్ట్ మహేష్‌తోనే కాబట్టి ఈ స్పెషల్ ఇంటర్వ్యూ పక్క ఉంటుందని కూడా టాక్ నడుస్తోంది. మరేం జరుగుతుందో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే.



Next Story

Most Viewed