- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OmBirla:ప్రతిపక్షాల అవిశ్వాస నోటీసులపై సెక్రటేరియట్ అధికారులకు స్పీకర్ కీలక ఆదేశాలు
లోక్ సభ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడేందుకు ఎల్ఓపీ రాహుల్ గాంధీని అనుమతించడం లేదని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాయి.

దిశ, వెబ్ డెస్క్: లోక్ సభ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడేందుకు ఎల్ఓపీ రాహుల్ గాంధీ (LOP Rahul Gandhi)ని అనుమతించడం లేదని ప్రతిపక్షాలు (Opposition parties) తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాయి. అలాగే స్పీకర్ ఓం బిర్లా ‘(Speaker Om Birla)పై అవిశ్వాస తీర్మానం నోటీసులను (Notices of no-confidence motion) సైతం ఇచ్చారు. కాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్ష ఎంపీలు సమర్పించిన నోటీసులో కీలక లోపాలు ఉన్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు గుర్తించాయి. ఈ నోటీసులో ఫిబ్రవరిలో జరిగిన కొన్ని సంఘటనలను నాలుగుసార్లు ప్రస్తావించినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం ఇటువంటి లోపాలు ఉన్న నోటీసులను తిరస్కరించే అవకాశం ఉంది. కానీ స్పీకర్ ఓం బిర్లా మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారు. ఆ నోటీసులోని లోపాలను సరిదిద్ది (Rectify), నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన సెక్రటేరియట్‌ను ఆదేశించారు.
కాగా పార్లమెంట్ నియమావళి ప్రకారం.. ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని స్పీకర్ స్పష్టం చెప్పినట్లు తెలుస్తుంది. బడ్జెట్ సమావేశాల రెండో దశ ప్రారంభమైన తర్వాత ఈ నోటీసును లిస్ట్ చేయనున్నారు. సవరించిన నోటీసు అందిన వెంటనే, నిర్దేశిత నిబంధనల ప్రకారం దానిని నిశితంగా పరిశీలిస్తామని సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. అలాగే తనపై వచ్చిన అభియోగాల విషయంలో నిబంధనలకు కట్టుబడి పారదర్శకంగా వ్యవహరించాలని స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్షాలు సమర్పించిన ఈ సవరించిన నోటీసుపై సెక్రటేరియట్ తీసుకునే నిర్ణయం ఆధారంగా లోక్‌సభలో తదుపరి చర్చలు, ఓటింగ్ ప్రక్రియ ఉండవచ్చు. స్పీకర్ స్వయంగా ఈ విషయంలో చొరవ చూపి లోపాలను సరిదిద్దమని కోరడం, నిబంధనల పట్ల ఆయనకున్న గౌరవాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






