వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్: జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదు

by Malleboina Mahesh |

వైసీపీ సభ్యులు సభకు రాకుండా జీతాలు పొందుతున్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్: జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో (Assembly meetings) వైసీపీ ఎమ్మెల్యేలు (YSRCP MLAs) పాల్గొనడం లేదు. ఈ వ్యవహారంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Speaker Ayyanna Patrudu) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండానే జీతాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన జీతాన్ని తీసుకోవడం లేదని స్పీకర్ వెల్లడించారు. కేవలం గవర్నర్ ప్రసంగం (Governor's Speech) రోజున సభకు హాజరైనంత మాత్రాన అది పూర్తిస్థాయి హాజరు కిందకు రాదని ఈ సందర్భంగా స్పీకర్ స్పష్టం చేశారు.

సభకు వరుసగా 65 రోజుల పాటు హాజరుకాని సభ్యులకు నోటీసులు జారీ చేస్తామని ఈ సందర్భంగా స్పీకర్ హెచ్చరించారు. అలాగే సభలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంట్‌లో చట్టాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో పార్లమెంట్ స్పీకర్‌ను కలిసి సంప్రదిస్తానని ఆయన తెలిపారు. ఇక జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కోరుతున్న ప్రతిపక్ష హోదా (Opposition status) గురించి ప్రస్తావిస్తూ.. నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి తేల్చి చెప్పారు.

Next Story