- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ ప్రయోగం విజయవంతం
అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' (SpaceX) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్టార్‌షిప్ ఫ్లైట్ 8' (IFT-8) టెస్ట్ ఫ్లైట్ ప్రయోగం అద్భుత విజయ సాధించింది.

దిశ, వెబ్ డెస్క్ : అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' (SpaceX) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్టార్‌షిప్ ఫ్లైట్ 8' (IFT-8) టెస్ట్ ఫ్లైట్ ప్రయోగం అద్భుత విజయ సాధించింది. విశ్వాంతరాళంలో మానవ ప్రయోగాలకు అత్యంత ప్రాధాన్యమైన ఈ వాహనం నింగిలోకి దూసుకెళ్లడమే కాకుండా, నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసింది. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సంక్లిష్ట ప్రక్రియలో అత్యంత ఖచ్చితమైన నియంత్రణను ప్రదర్శిస్తూ, స్టార్‌షిప్ ఉపరితలంపై శుక్రవారం అత్యంత క్షేమంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. స్టార్‌షిప్ ప్రాజెక్టు చరిత్రలోనే ఇప్పటివరకు నమోదైన అత్యంత విజయవంతమైన ప్రయోగంగా ఇది రికార్డులకెక్కింది.
ఈ ప్రయోగంలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను, అంతరిక్ష ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఘట్టం 'సూపర్ హెవీ బూస్టర్' ల్యాండింగ్. ప్రయోగం ముగిసిన అనంతరం నింగి నుంచి భూమి వైపు దూసుకొచ్చిన రాకెట్ బూస్టర్‌ను, లాంచ్ టవర్‌కు అమర్చిన భారీ మెకానికల్ ఆర్మ్స్ ద్వారా గాల్లోనే సురక్షితంగా పట్టుకోవడంలో స్పేస్‌ఎక్స్ ఇంజనీర్లు సాధించిన విజయం సాంకేతిక రంగాన్ని విస్తుపోయేలా చేసింది. ఈ అద్భుత విజయంపై స్పేస్‌ఎక్స్ అధినేతి ఎలాన్ మస్క్ ఆనందం వ్యక్తం చేశారు. రాకెట్లను పదే పదే ఉపయోగించే (Reusability) దిశగా సాధించిన ఈ విజయం అంతరిక్ష ప్రయాణ వ్యయాన్ని ఊహించని స్థాయిలో తగ్గిస్తుందని, భవిష్యత్తులో చేపట్టబోయే అంగారకయాత్ర మిషన్లకు, నాసా (NASA) అత్యంత ఆశగా ఎదురుచూస్తున్న 'ఆర్టెమిస్' చంద్రమండల ప్రాజెక్టుకు ఇది అత్యంత కీలకమైన మలుపు అని ఆయన స్పష్టం చేశారు.






