- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బిజెపీ, టీఆర్ఎస్ ఘర్షణపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలు వెల్లడించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన రచ్చ వల్లే గొడవ చోటు చేసుకుందన్నారు. ఇక ముందు ఇలాంటి పోస్టులో పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి పేట ఘటనలో సీసీ ఫుటేజ్‌తో పాటు, పోలీసులు కూడా వీడియో రికార్డు చేశారని వాటి ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికి సుమారు 12 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఘర్షణను నియంత్రిస్తున్న క్రమంలో ఎస్సైకి కూడా గాయాలైనట్టు ఎస్సీ తెలిపారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.
Next Story






