- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరు విమానాశ్రయంలో దారుణం.. తనిఖీల పేరుతో దక్షిణ కొరియా మహిళపై లైంగిక వేధింపులు
తనిఖీల పేరుతో దక్షిణ కొరియా మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనంగా మారింది. సిలికాన్ వ్యాలీ లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIAL) భద్రతా వైఫల్యం తో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది.

దిశ, వెబ్ డెస్క్: తనిఖీల పేరుతో దక్షిణ కొరియా మహిళపై లైంగిక వేధింపుల (Sexual harassment)కు పాల్పడటం సంచలనంగా మారింది. సిలికాన్ వ్యాలీ లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIAL) భద్రతా వైఫల్యం తో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. తనిఖీల నెపంతో ఓ విదేశీ మహిళపై విమానాశ్రయ సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియాకు చెందిన ఒక మహిళ స్వదేశానికి వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. టికెట్ తనిఖీ సమయంలో, అక్కడ పనిచేస్తున్న అఫాన్ అహ్మద్ అనే సిబ్బంది ఆమె బ్యాగు నుంచి 'బీప్' శబ్దం వస్తోందని నమ్మబలికాడు. లగేజీని విడిగా తనిఖీ చేయాలని చెప్పి, ఆమెను పురుషుల టాయిలెట్ వైపు తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి, తనిఖీ చేస్తున్నట్లు నటిస్తూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించాడు.
అనంతరం ఆ మహిళా బాధితురాలు వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు సీసీటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలించగా, నిందితుడు ఆమెను తీసుకెళ్లినట్లు ఆధారాలు లభించాయి. దీంతో భద్రతా సిబ్బంది అఫాన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్ పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన విచారణ కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రయాణికులకు రక్షణ కల్పించాల్సిన సిబ్బందే ఇలాంటి అకృత్యాలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read More..






