వైద్య సిబ్బంది తప్పిదం.. పురుషుడికి గర్భసంచి

by Muthe.Rajitha |

ఒక డయాగ్నస్టిక్ సెంటర్ చేసిన ఘోర తప్పిదం సంచలనం రేపింది.

వైద్య సిబ్బంది తప్పిదం.. పురుషుడికి గర్భసంచి
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఒక డయాగ్నస్టిక్ సెంటర్ చేసిన ఘోర తప్పిదం సంచలనం రేపింది. ఉచ్చెహరా మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నిరంజన్ ప్రజాపతి అనే 47 ఏళ్ల వ్యక్తి కడుపు నొప్పితో ఈనెల 13న 'సత్నా డయాగ్నస్టిక్ సెంటర్'లో సోనోగ్రాఫీ చేయించుకున్నాడు. అయితే అతనికి "గర్భసంచి" ఉందని, అది 'యాంటీవర్టెడ్' స్థితిలో ఉందని రిపోర్ట్ ఇచ్చారు సిబ్బంది. అప్పటి నుంచి ప్రజాపతిని చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు హేళన చేయడంతో.. ఎంతో మానసిక వేదనకు గురయ్యాడు. అయితే దీనిపై మరోసారి పరీక్షలు చేయించగా నార్మల్ గానే ఉండటంతో.. ముందు ఇచ్చిన రిపోర్ట్ మరో మహిళా రిపోర్ట్‌తో మారిపోవడం వల్ల జరిగిన పొరపాటుగా డయాగ్నిస్టిక్ సెంటర్ సిబ్బంది గుర్తించారు.

అయినప్పటికీ ఇది తీవ్రమైన నిర్లక్ష్యమని భావించిన ప్రజాపతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఆరోగ్య శాఖ ముఖ్య అధికారి (CMHO) డయాగ్నస్టిక్ సెంటర్ కార్యకలాపాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Next Story