'పుష్పరాజ్'గా మారిన గంగూలీ.. తగ్గేదేలే అంటూ

by Dishafeatures2 |
పుష్పరాజ్గా మారిన గంగూలీ.. తగ్గేదేలే అంటూ
X

దిశ, సినిమా: 'పుష్ప' సినిమా విడుదలై వంద రోజులు దగ్గరపడుతున్న మూవీ మేనియా ఇంకా తగ్గేట్లేదు. టాలీవుడ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం బాలీవుడ్‌లో అంతకుమించిన కలెక్షన్లతో రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌ మేనరిజం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులను ఫిదా చేసింది. దీంతో సామాన్యుల నుంచి మొదలు సినీ, క్రీడా సెలబ్రిటీల వరకు ఈ సినిమా పాటలు, డైలాగ్స్‌కు రీల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా ఈ జాబితాలోకి చేరిపోయాడు. తాజాగా 'జీ బంగ్లా' ఛానెల్‌లో ప్రసారమయ్యే ఓ రియాలిటీ షోలో పాల్గొన్న గంగూలీ.. 'శ్రీవల్లి' సాంగ్‌కు స్పెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు పుష్ప సిగ్నేచర్‌ 'తగ్గేదేలే' అంటూ అభిమానుల్లో జోష్‌ పెంచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.


Next Story

Most Viewed