- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోనియా గాంధీ శరీరం చికిత్సకు సహకరిస్తోంది: వైద్యుల ప్రకటన
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రి (Sir Ganga Ram Hospital)లో చేరిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో గత సోమవారం రాత్రి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు ఆమె శరీరం బాగా సహకరిస్తోందని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ (Dr. Ajay Swarup) అధికారికంగా ప్రకటించారు. సోనియా గాంధీని ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన చలి, వాయు కాలుష్యం కారణంగా సోనియా గాంధీకి 'బ్రాంకియల్ ఆస్తమా' (Bronchial Asthma) సమస్య కొద్దిగా తిరగబెట్టినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ముందుజాగ్రత్త చర్యగా ఆమెను అడ్మిట్ చేసుకున్న వైద్యులు, ప్రస్తుతం యాంటీబయాటిక్స్, ఇతర అవసరమైన మందులతో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుందని, వైద్యుల సూచనల మేరకు ఒకటి, రెండు రోజుల్లో ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.






