Sonakshi Sinha: సోనాక్షి బాత్‌రూమ్‌లో అభిమాని వీరంగం.. రక్తంతో రాస్తానంటూ

by Dishanational2 |
Sonakshi Sinha: సోనాక్షి బాత్‌రూమ్‌లో అభిమాని వీరంగం.. రక్తంతో రాస్తానంటూ
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హాకు వింత అనుభవం ఎదురైంది. ఓ యువకుడు తనను పెళ్లి చేసుకోవాలంటూ నానా హంగామా చేశాడు. విషయానికొస్తే.. సోనాక్షి ఇటీవల 'ది ఖత్రా ఖత్రా' కామెడీ షోలో పాల్గొంది. ఈ క్రమంలోనే తను వ్యానిటీ వ్యాన్‌‌లో మేకప్ చెక్ చేసుకుంటుండగా.. అక్కడే ఉన్న వాష్ రూమ్‌ నుంచి బయటకొచ్చిన ఓ అబ్బాయి ఆమెను చూడగానే ఒక్కసారిగా ఆనందంతో గంతులేశాడు. అంతటితో ఆగకుండా పెళ్లి చేసుకోమని బతిమిలాడుతూ సోనాక్షి పేరుతో వేయించుకున్న పచ్చబొట్టు చూపించాడు. కాదంటే చచ్చిపోతానని గొంతు కత్తి పెట్టుకుని బెదిరించాడు. పక్కనున్న అద్దంపై లిప్ స్టిక్‌తో 'ఐ లవ్‌ యూ సోనా' అని రాసి .. 'ఇది నా రక్తంతోనూ రాయగలను' అంటూ అల్లరి చేశాడు. అలా చేయొద్దని సోనాక్షి సైగ చేస్తుండగానే ఆవేశానికి గురైన అభిమాని అక్కడున్న వస్తువులు విసిరేయడంతో ఆమె కేకలు వేయడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. షో క్యాంపెయిన్‌లో భాగంగా సోనాక్షికి తెలియకుండా నిర్వాహకులు ప్రాంక్‌ చేసినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed