ఆ హత్యల వెనుక పెద్ద విషయమే ఉంది.. సీఎం మమతా బెనర్జీ

by Vinod kumar |

కోల్‌కతా: బెంగాల్ సముహా హత్యలపై ప్రతిపక్ష - "Something Big" Behind Bengal Killings: Mamata Banerjee Amid Political Row

ఆ హత్యల వెనుక పెద్ద విషయమే ఉంది.. సీఎం మమతా బెనర్జీ
X

కోల్‌కతా: బెంగాల్ సముహా హత్యలపై ప్రతిపక్ష బీజేపీ రాజకీయ హింస, అన్యాయాన్ని అనుమతించిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ హత్యల వెనుక ఏదో పెద్ద విషయమే దాగి ఉందని ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం సంఘటన జరిగిన గ్రామమైన బిర్భూంలో ఆమె పర్యటించారు. 'ఆధునిక బెంగాల్‌లో ఇలాంటి అనాగరికం జరుగుతుందని నేను ఎప్పుడూ నమ్మలేదు. తల్లులు, పిల్లలు చంపబడ్డారు. మీ కుటుంబ సభ్యులు మరణించారు. నాకు తీవ్ర ఆవేదన ఉంది అని బాధితుల కుటుంబాలను ఆమె ఓదార్చారు. ఈ చర్యలకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.


పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని అన్నారు. ఎలాంటి సాకులు ఉండకూడదని తెలిపారు. బాధ్యులను అరెస్ట్ చేయాలని చెప్పారు. సాక్ష్యులకు పోలీస్ బందోబస్త్ కల్పిస్తామని అన్నారు. అంతేకాకుండా తగలబడిన ఇళ్లను మరమ్మతులు చేసేందుకు రూ.2లక్షల ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మృతులు కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మంగళవారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తిగత కక్షలతో 8 మందిని సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే.

Next Story