సామాజిక సేవే లయన్స్ క్లబ్ లక్ష్యం

by Ratna Kumari |

సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే వైరా లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని లయన్స్ క్లబ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, కాంగ్రెస్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాపా మురళీకృష్ణ అన్నారు.

సామాజిక సేవే లయన్స్ క్లబ్ లక్ష్యం
X

దిశ, వైరా : సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే వైరా లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని లయన్స్ క్లబ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, కాంగ్రెస్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాపా మురళీకృష్ణ అన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం వైరా మండలంలోని విప్పలమడక గ్రామానికి ఉచితంగా ఫ్రీజర్ బాక్స్‌ను అందజేశారు. అలాగే ఎస్సీ స్మశానవాటికలో ఏర్పాటు చేసిన చేతిపంపును, ఫ్రీజర్ బాక్స్ భద్రపరిచేందుకు నిర్మించిన గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడా సంపత్ అధ్యక్షతన నిర్వహించిన సభలో కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సామాజిక సేవతోనే మానవ జన్మ సార్థకమవుతుందని పేర్కొన్నారు. తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విప్పలమడక గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మేడా శంకరయ్య–సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.

అంతకుముందు గ్రామంలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మురళీకృష్ణ, అనంతరం కేక్ కట్ చేసి గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా జీఈటీ కోఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు, ఎల్‌సీఎఫ్‌ఐ కోఆర్డినేటర్ లగడపాటి ప్రభాకర్ రావు, జోన్ చైర్మన్ తోటకూర శ్రీకాంత్, రీజనల్ సెక్రటరీ వై.బుచ్చిరామారావు, మాజీ సర్పంచులు పారుపల్లి కృష్ణారావు, తుమ్మల జానుపాపయ్య, మాజీ ఎంపీటీసీ ఆకుల ప్రసాద్, సోమలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వీరపనేని చెన్నకేశవరావు, ఉపసర్పంచ్ బూర్గు లూర్దమ్మ, న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు, గ్రామ కార్యదర్శి నాగేశ్వరరావు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కొల్లికొండ వీరభద్రరావు, లయన్స్ క్లబ్ సభ్యులు చింతోజు నాగేశ్వరరావు, చింతలపూడి వెంకటేశ్వరరావు, ఉయ్యూరు రామకృష్ణ, గంగవరపు కిషన్, పువ్వాడ రాము, వార్డు సభ్యులు ముత్తమాల నాగజ్యోతి, పారుపల్లి నిఖిత, ముత్తమాల దేవానందం, కాశిమాల సామేలు, బూర్గు నందిని, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story