- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మృతి మంధాన-పలాశ్ ఫొటో.. చీటర్ ఎవరో తేల్చిన గ్రోక్..!
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి పీటల మీద ఆగిపోయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పెళ్లి పీటల మీద ఆగిపోయిన విషయం తెలిసిందే. కొన్ని అనుకోని కారణాల వల్ల ఇరువురు వివాహం రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే.. దీనికి కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకోలేదు. వివాహం రద్దు అయిన తర్వాత ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. కానీ.. నెటిజన్లు మాత్రం వీరి పెళ్లి రద్దు ప్రకటనలపై చర్చలు చేస్తూనే ఉన్నారు. కొందరు పలాశ్‌ను తప్పుబడితే.. ఇంకొందరు స్మృతీని విమర్శిస్తున్నారు. మరో యువతితో పలాశ్ రిలేషన్‌లో ఉన్నాడని.. ఈ విషయం తెలిసి చివరి నిమిషంలో స్మృతి పెళ్లి రద్దు చేసుకుందనీ వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షార్ట్స్ కూడా వైరల్ చేశారు. తాజాగా స్మృతి మంధాన, పలాశ్ మచ్చల్ ఇద్దరి ఫొటోలు ఎక్స్‌లో నెటిజన్లు పోస్టు చేశారు. ఇద్దరిలో చీటర్‌ను రిమూవ్ చేయాలని గ్రోక్‌ను అడిగారు. అయితే.. పలాశ్‌ను గ్రోక్ రిమూవ్ చేసింది. దీంతో చీటర్ పలాశే అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






