- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పి బోల్తా కొట్టిన స్లీపర్ బస్సు.. ఇద్దరు మృతి, 23 మందికి గాయాలు
ఢిల్లీలో ఘోర ప్రమాదం! కరోల్ బాగ్‌లో బోల్తా పడ్డ జైపూర్ స్లీపర్ బస్సు.. ఇద్దరు మృతి, 23 మందికి గాయాలు. అర్ధరాత్రి వేళ సహాయక చర్యలు.

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టడంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు రెండు అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక హాహాకారాలు చేశారు. అధికారులు గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు.. బుధవారం తెల్లవారుజామున సుమారు 1:10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫైర్ సర్వీస్ అధికారులు ధ్రువీకరించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






