షాకిచ్చిన శివకార్తికేయన్.. హాట్ టాపిక్‌గా మారిన కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-16 06:39:53  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan) ‘అమరన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక గత ఏడాది నుంచి ఆయనకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది.

షాకిచ్చిన శివకార్తికేయన్.. హాట్ టాపిక్‌గా మారిన కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan) ‘అమరన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక గత ఏడాది నుంచి ఆయనకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. శివ కార్తికేయన్ నటించిన ‘మదరాసి’ భారీ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆయన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మక చిత్రంగా వచ్చిన ‘పరాశక్తి’ వివాదంలో చిక్కుకుంది. అనుకున్నట్లుగానే ‘పరాశక్తి’ సంక్రాంతి కానుకగా.. విడుదలైనప్పటికీ కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా.. శివకార్తికేయన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ఇటీవల కాలంలో నాకు సరైన కామెడీ స్క్రిప్టులు రావడం లేదు. నేను కామెడీ సినిమాలు ఎందుకు చేయడం లేదని అందరూ అడుగుతుంటారు. కానీ నిజం ఏంటంటే.. పూర్తిస్థాయి కామెడీ కథతో ఎవరూ నా దగ్గరకు రావడం లేదు. ఇందులో బడ్జెట్ వంటి అనేక అంశాలు కూడా కీలకంగా చేస్తున్నాయి. అయినప్పటికీ, తదుపరి సినిమా మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనర్‌గానే ఉంటుంది అని శివకార్తికేయన్ స్పష్టం చేశాడు. అలాగే ‘పరాశక్తి’(Parashakti), ‘అమరన్’ వంటి సినిమాలు తనలోని మరో కోణాన్ని బయటకు తీసుకొచ్చాయని అన్నారు.

అలాంటి డిఫరెంట్, సీరియస్ పాత్రలు చేయడం తనకు సంతృప్తినిచ్చినప్పటికీ.. ప్రేక్షకులను నవ్వించే కామెడీ ఎంటర్టైనర్స్ చేయాలని ఉందని చెప్పాడు. దురదృష్టవశాత్తు ఇప్పటివరకు పూర్తిస్థాయి కామెడీ స్క్రిప్ట్ ఎవరూ వినిపించలేదని చెప్పిన శివకార్తికేయన్, మంచి కథ దొరికితే మాత్రం తప్పకుండా అలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

Read More..

Dhanush: బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ధనుష్.. ‘D-54’టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల

Next Story