కేసీఆర్‌ లేఖపై స్పందించిన సిట్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-29 15:54:11  IST  )

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖపై సిట్ అధికారులు స్పందించారు.

కేసీఆర్‌ లేఖపై స్పందించిన సిట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖపై సిట్ అధికారులు స్పందించారు. కేసీఆర్‌ కోరిన విధంగా సమయం ఇవ్వాలని నిర్ణయించారు. తదుపరి విచారణ, కొత్త తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. అంతకుముందు సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు నందినగర్‌లోని నివాసంలో అందుబాటులో ఉండాలని వారు కోరారు. అయితే.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారమే ఆఖరు తేదీ కావడంతో.. అభ్యర్థులను ఖరారు చేయడంతో తాను బిజీగా ఉన్నానని విచారణను మరోరోజు జరపాల్సిందిగా కేసీఆర్ పోలీసులకు తెలిపారు. జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరికి శుక్రవారం తాను హాజరు కాలేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ రెండు పేజీల లేఖ రాశారు. సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం మరో రోజున తనను ఎర్రవల్లిలోని నివాసంలో విచారించాలి. 65 ఏళ్లు పైబడిన వారు విచారణ కోసం పోలీస్ స్టేషన్ వెళ్లనవసరం లేదు. పోలీసులే వారి ఇంటివద్దకు వెళ్లి విచారణ చేపట్టాలి. ఇకపై నాకు పంపాల్సిన నోటీసులను కూడా ఎర్రవల్లికే పంపాలని కేసీఆర్ కోరారు.

Read More.. ఎర్రవల్లిలో కేసీఆర్‌తో హరీశ్ రావు కీలక సమావేశం

Next Story