- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రవల్లిలో కేసీఆర్‌తో హరీశ్ రావు కీలక సమావేశం
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో గురువారం మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు కీలక సమావేశానికి హాజరయ్యారు.

దిశ, ములుగు : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో గురువారం మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు కీలక సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో ఇటీవల సిట్ సమర్పించిన నివేదికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. శుక్రవారం సిట్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిన అంశాలు, అడిగే ప్రశ్నలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాధానాలపై ఇద్దరి మధ్య విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిట్ నివేదిక వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నివేదికను ఎలా ఎదుర్కోవాలి, పార్టీకి నష్టం కలగకుండా ప్రజల్లో వాస్తవాలు ఎలా తీసుకెళ్లాలన్న విషయాలపై సమాలోచన జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ వైఖరి, ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోవాల్సిన రాజకీయ అడుగులు, ప్రజా ఉద్యమాల రూపకల్పన, మీడియా ముందుకు వెళ్లాల్సిన అంశాలపై కూడా కేసీఆర్, హరీష్ రావు మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.






