KCRకు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరిన KTR, హరీశ్‌రావు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-29 08:03:32  IST  )

తెలంగాణ రాజకీయాలను అతలాకుతలం చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు నమోదవుతున్నాయి.

KCRకు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరిన KTR, హరీశ్‌రావు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాలను అతలాకుతలం చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సంచలనాలు నమోదవుతున్నాయి. తాజాగా, సిట్ అధికారులు నగరంలోని నందీనగర్ నివాసానికి వెళ్లి విచారణకు సహకరించాలని గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు అందజేశారు. ప్రస్తుతం ఆయన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉండగా.. ఇంట్లో ఉన్న సిబ్బందికి నోటీసులు హ్యాండోవర్ చేశారు. అందులో కేసీఆర్ ఎక్కడ విచారించాలని కోరితే అక్కడే విచారిస్తామని.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తమ అధినేతకు సిట్ నోటీసులు ఇస్తుందని ముందుగానే ఊహించామని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్‌కు నోటీసులు అందడంతో కేటీఆర్‌తో పాటు హరీశ్ రావు, పార్టీ ముఖ్య నేతలు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. సిట్ నోటీసులపై ఎలా స్పందించాలనే దానిపై కేసీఆర్‌తో కలిసి వారు లీగల్ టీమ్‌తో భేటీ కాబోతున్నట్లుగా సమాచారం. ఇక రేపు విచారణకు కేసీఆర్ సహరిస్తారా..? లేక న్యాయపరంగా ఉన్న ఆప్షన్లను పరిశీలిస్తారా అనేది తేలాల్సి ఉంది.

Similar News : ఫోన్ ట్యాపింగ్ కేసులో సెన్సేషన్.. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు!

Next Story