బీఆర్ఎస్ మాజీ MP సంతోష్ రావుకు సిట్ నోటీసులు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-26 13:31:15  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

బీఆర్ఎస్ మాజీ MP సంతోష్ రావుకు సిట్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ ఎంపీ సంతోష్ రావు(Santosh Rao)కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. రాజకీయంగా ఈ అంశం చర్చగా మారుతోంది. వరుసగా హరీష్.. ఆ తరువాత కేటీఆర్ విచారణతో ఈ కేసులో కొత్త అంశాలు తెర మీదకు వచ్చాయి. తాజాగా ఇదే కేసులో మరో బీఆర్ఎస్ ముఖ్యనేత అయిన సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ కేసులో బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవటం లేదంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వాదన భిన్నంగా ఉంది. ఇదే సమయంలో ఈ కేసులో ప్రభుత్వం ఇక కఠిన చర్యలకు సిద్దం అవుతోంది. ఈ పరిణామాలు రాజకీయంగా కొత్త టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

READ MORE ....

నోటీసుల్లో ఎంపీగా పేర్కొన్న సిట్.. స్పందించిన సంతోష్ రావు

Next Story