నోటీసుల్లో ఎంపీగా పేర్కొన్న సిట్.. స్పందించిన సంతోష్ రావు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-26 13:30:07  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ నేత సంతోష్ రావు స్పందించారు.

నోటీసుల్లో ఎంపీగా పేర్కొన్న సిట్.. స్పందించిన సంతోష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ నేత సంతోష్ రావు(Santosh Rao) స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘సిట్ నోటీసులు అందాయి. రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు అవుతా. సిట్ అడిగిన ప్రతీ ప్రశ్నకు జవాబు చెబుతా’ అని సంతోష్ రావు స్పష్టం చేశారు. కాగా, ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సంతోష్ రావుకు సిట్ నోటీసులు పంపించింది. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణపై దర్యాఫ్తు సంస్థను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతించామని, ఇంకెంత కాలం విచారణ కొనసాగిస్తారని ప్రశ్నించింది. ప్రభాకర్ రావు విచారణను త్వరగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ఇదిలా ఉంటే.. సిట్ అధికారులు జారీచేసిన నోటీసుల్లో సంతోష్ రావును పదవీకాలం ముగిసినా కూడా ఎంపీగా పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




Next Story