గ్రూప్ ఉద్యోగాల్లో మెరిసిన అక్కాచెల్లెళ్లు

by Muthe.Rajitha |

తల్లిదండ్రుల ప్రోత్సాహమే తమ విజయానికి కారణం

గ్రూప్ ఉద్యోగాల్లో మెరిసిన అక్కాచెల్లెళ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల APPSC ప్రకటించిన గ్రూప్ పరీక్షల ఫలితాల్లో ఒకే ఇంటికి చెందిన అక్కాచెల్లెళ్లు ఉద్యోగాలు సాధించి, అరుదైన ఘనత నమోదు చేసారు. గుంటూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు ప్రియాంక, సాహితీ ఇద్దరూ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవడంతో వారి తల్లిదండ్రుల సంతోషానికి అంతులేకుండా పోయింది. అక్క ప్రియాంక గ్రూప్‌–1 పరీక్షలో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపిక కాగా, చెల్లి సాహితి గ్రూప్‌–2లో రోడ్లు, భవనాల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. అయితే ప్రియాంకకు ఇది మూడవ ప్రయత్నం కాగా, సాహితికి ఇది మొదటి ప్రయత్నమే కావడం గమనార్హం.

వీరి తండ్రి చంద్రుడు వాణిజ్యపన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. తల్లి స్వర్ణలలిత కర్నూలు జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కౌన్సిలర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కష్టపడి చదివే తత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహమే తమ విజయానికి కారణమని ఈ అక్కాచెల్లెళ్లు చెబుతుండగా.. ఆడపిల్లలను భారంగా భావించే వారికి ఈ విజయం ఓ కనువిప్పుగా మారాలని అన్నారు.

Next Story