- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి 'SIR'
ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో మూడవ దశ కార్యక్రమాన్ని చేపడతామని అధికారులు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2026 ఏప్రిల్ నుంచి SIR (Special Intensive Revision) ప్రక్రియను మొదలు పెట్టనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ECI) అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో SIR ప్రారంభించి, మే మూడవ వారానికల్లా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలియజేసారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం SIR ప్రక్రియ తొలి దశను బిహార్ లో పూర్తి చేయగా.. ప్రస్తుతం రెండో దశలో దేశంలోని 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగిస్తోంది.
రెండవ దశలో గుజరాత్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో మూడవ దశ SIR ప్రక్రియను చేపడతామని అధికారులు వెల్లడించారు. అయితే ఈ SIR ప్రక్రియపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న సంగతి తెలిసిందే.






