దుల్కర్ శ్రీ శ్రీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్

by Chukka Sudharani |

హీరోగా, నిర్మాతగా వరుస సూపర్ హిట్ సక్సెస్‌లతో దూసుకుపోతున్న మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్..

దుల్కర్ శ్రీ శ్రీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా: హీరోగా, నిర్మాతగా వరుస సూపర్ హిట్ సక్సెస్‌లతో దూసుకుపోతున్న మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన నటిస్తున్న వరుస చిత్రాల్లో 'DQ41' ఒకటి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆడియన్స్‌లో విశేష క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘శ్రీ శ్రీ మొదటి పాట ‘బొమ్మ బొమ్మ’ జులై 27న సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది’ అంటూ దుల్కర్, పూజా ఉన్న ఈ సరికొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఎంతో క్యూట్‌తో కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రజెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ నెట్టింట వైరల్ అవుతున్నది. కాగా.. "Love Will Spark Again" అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రవి నెలకుడిటి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

Next Story