- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : భారతీయ సాంస్కృతిక, చారిత్రక వైభవానికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పురాతన బౌద్ధ క్షేత్రం, బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన తొలి ధర్మ బోధన చేసిన పవిత్ర స్థలమైన 'సారనాథ్' కు యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ హోదా లభించింది. దక్షిణ కొరియాలోని బుసాన్ నగరం వేదికగా జరుగుతున్న యునెస్కో 48వ 'వరల్డ్ హెరిటేజ్ కమిటీ' (48th World Heritage Committee) సమావేశాల్లో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సారనాథ్‌ను ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చినట్లు యునెస్కో తన అధికారిక సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా వెల్లడించింది.
ఈ నూతన గుర్తింపుతో భారత దేశపు సాంస్కృతిక ప్రాముఖ్యత ప్రపంచ వేదికపై మరొకసారి ప్రతిబింబించింది. ఇప్పటివరకు భారతదేశంలో 44 ప్రదేశాలకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లుగా గుర్తింపు ఉండగా, తాజాగా సారనాథ్ ఈ జాబితాలో చేరడంతో భారత్‌లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంఖ్య 45కి చేరుకోవడం విశేషం. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు, ముఖ్యంగా బౌద్ధ మత అభిమానులకు, చారిత్రక పరిశోధకులకు సారనాథ్ అత్యంత పవిత్రమైన క్షేత్రంగా నిలుస్తోంది. ఈ గౌరవంతో భారతదేశ ఆధ్యాత్మిక సేవలకు, పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించినట్లయింది.






