- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ యాక్టర్స్ క్రికెట్ పోటీలు ప్రారంభం
విశాఖపట్నంలోని వైఎస్ఆర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 'ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్-2' పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలోని వైఎస్ఆర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 'ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్-2' పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సినీ నటులు శ్రీకాంత్, తరుణ్, సుధీర్ బాబు, ఓంకార్‌లతో పాటు బుల్లితెర నటులు, ప్రజాప్రతినిధులు, వైద్యులతో కూడిన మొత్తం ఆరు విభిన్న జట్లు ఈ టోర్నీలో తలపడుతున్నాయి. తొలిరోజే మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగడమే కాకుండా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రారంభ మ్యాచ్‌లో శ్రీఇన్ఫో మిసైల్స్ జట్టు 21 పరుగుల తేడాతో ఆంధ్రా గవర్నమెంట్ లయన్స్ జట్టుపై ఘనవిజయం సాధించగా, రెండో పోరులో బుల్లితెర రేంజర్స్ జట్టు 5 పరుగుల ఉత్కంఠ తేడాతో ఆయుష్మాన్ అవెంజర్స్ జట్టును ఓడించింది. ఇక మూడో మ్యాచ్ టాలీవుడ్ థండర్స్, ఆంధ్రా పొలిటికల్ జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ఈ టోర్నీకి నగరవాసులు, క్రీడాభిమానుల నుంచి అద్భుత స్పందన లభించింది. తమ అభిమాన నటులు, ప్రముఖులను మైదానంలో చూసేందుకు ప్రేక్షకులు పెద్దఎత్తున స్టేడియానికి తరలివచ్చారు. బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లు బాదిన ప్రతిసారీ ప్రేక్షకులు కేరింతలు కొడుతూ మైదానాన్ని హోరెత్తించారు.






