- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Exports: 'మేడ్ ఇన్ ఇండియా' ఎగుమతులకు కొత్త దారి
దేశీయ విక్రయాలపై ఉన్న ఇన్వెంటరీ నిబంధనల నిషేధం యథాతథంగానే కొనసాగనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఉత్పత్తుల ఎగుమతులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి విదేశీ ఈ-కామర్స్ దిగ్గజాలు భారత్‌లో కేవలం విక్రేతలకు, కొనుగోలుదారులకు మధ్య 'మార్కెట్‌ప్లేస్'గా మాత్రమే పనిచేసేందుకు అనుమతి ఉండేది. అయితే తాజా నిర్ణయంతో, కేవలం ఎగుమతుల కోసం ఈ కంపెనీలు దేశంలో స్వంత గిడ్డంగులు (ఇన్వెంటరీ) ఏర్పాటు చేసుకుని, భారతీయ ఉత్పత్తులను నేరుగా విదేశీ వినియోగదారులకు విక్రయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, దేశీయ విక్రయాలపై ఉన్న ఇన్వెంటరీ నిబంధనల నిషేధం యథాతథంగానే కొనసాగనుంది. ఈ నిర్ణయం ద్వారా ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంసీలు) విదేశీ మార్కెట్లలో భారీ అవకాశాలు లభించనున్నాయి. 2030 నాటికి భారత వస్తు ఎగుమతులను 1 ట్రిలియన్ డాలర్ల(రూ. 96.8 లక్షల కోట్ల)కు చేర్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిర్ణయం ఊతం కానుంది.






