ఆన్‌లైన్‌లో ‘SIR’ సులువుగా.. సులభంగా!

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-16 04:41:19  IST  )

తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే(SIR) ప్రక్రియలో, క్షేత్రస్థాయిలో BLOలు అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఆన్‌లైన్‌లో ‘SIR’ సులువుగా.. సులభంగా!
X

దిశ, పేట్ బషీరాబాద్: తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే(SIR) ప్రక్రియలో, క్షేత్రస్థాయిలో BLOలు అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందడం మరికొందరికి అందకపోవటం జరుగుతుంది. అందిన వారికి ఆ దరఖాస్తులను మళ్లీ ఎక్కడ ఇవ్వాలి అనే ప్రశ్న వస్తుంది. ఫామ్స్ రానివారు తమ దరఖాస్తుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా కొంతమందికి ఆధార్ అనుసంధానం ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఓటర్ కార్డు.. ఆధార్ కార్డులో వ్యత్యాసాల?

అవగాహన ఉన్న కొంతమంది ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్స్‌ను సబ్మిట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇందులో ఆధార్‌లో పేరు, ఓటర్ కార్డులో పేరు పూర్తిగా వ్యత్యాసంతో ఉంటే ప్రక్రియ పూర్తి కాదు. కానీ పేరు, ఇంటి పేరు అటు ఇటుగా ఉన్న ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఉదాహరణ ఆధార్ కార్డులో ముందు వ్యక్తి పేరు abcd గా, తర్వాత ఇంటిపేరు xyz గా (abcd XYZ) ఉండి ఓటర్ కార్డులో మాత్రం ముందు ఇంటి పేరు XYZ గా, తర్వాత వ్యక్తి పేరు abcd గా (XYZ abcd) గా ఉన్న సందర్భంలో కూడా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. కానీ, వ్యక్తి పేరు ఆధార్ కార్డులో abcd XYZ గా ఉండి ఓటర్ కార్డులో మాత్రం IJKl XYZ గా ఉంటే మాత్రం కుదరదు. అయితే, మీ చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా 2002 నాటి ఓటర్ వివరాలను ఉపయోగిస్తూ, ఆన్‌లైన్‌లో దరఖాస్తును సులభంగా పూర్తి చేయవచ్చు. ఏమ్యూనరేషన్ ఫామ్ ఏ విధంగా పూర్తి చేయాలో ఇప్పుడు దశలవారీగా చూద్దాం.

మొదటి దశ: పోర్టల్ లాగిన్ మరియు సైన్-అప్

*ముందుగా ఫోన్‌లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి, అడ్రస్ బార్‌లో ecinet అని టైప్ చేయండి.

*సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించే మొదటి లింక్ (http://officials.eci.gov.in)ను సెలెక్ట్ చేసుకోండి.

హోమ్ పేజీలో *"Voter Services" విభాగం కనిపిస్తుంది. అందులో "Voter Registration Forms" అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.

*మీకు అకౌంట్ లేకపోతే, *"Sign-Up" ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ మరియు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి 'Continue' బటన్ ప్రెస్ చేయండి.

మీ *First Name (పేరు), Last Name (ఇంటి పేరు) ఎంటర్ చేయాలి. పేరును టైప్ చేసేటప్పుడు అక్షరాల మధ్య స్పేస్ ఇచ్చిన, చివర మాత్రం ఎటువంటి 'స్పేస్' ఇవ్వకూడదు.

రిక్వెస్ట్ OTP పై క్లిక్ చేసి, వచ్చిన OTPని ఎంటర్ చేస్తే *"User created successfully" అని పాప్-అప్ వచ్చి, మళ్లీ హోమ్ స్క్రీన్‌కు తీసుకెళ్తుంది.

రెండో దశ: ఎన్యుమరేషన్ ఫారమ్ మరియు ఓటర్ ఐడి లింకింగ్

*హోమ్ స్క్రీన్‌పై ఉన్న *"Fill Enumeration Form"*ను క్లిక్ చేసి, మీ ఓటర్ ఐడి నంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి OTPని పొందండి.

మీ మొబైల్ నంబర్ ఓటర్ ఐడికి లింక్ కానట్లయితే, *"Mobile number is not linked" అని సందేశం వస్తుంది. అప్పుడు అక్కడ కనిపించే "Click here" లింక్ ద్వారా "Form 8" లోకి వెళ్లాలి.

అక్కడ *"Self" ఆప్షన్‌ను ఎంచుకుని మీ ఓటర్ ఐడి నంబర్ సబ్మిట్ చేస్తే, మీ వివరాలు (పోలింగ్ బూత్, సీరియల్ నంబర్) కనిపిస్తాయి.

మూడవ దశ: ఫారం-8 ద్వారా సవరణ, ఆధార్ - ఫోన్ నెంబర్ లింకింగ్

ఓటర్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాల్సిన ప్రక్రియలు కచ్చితంగా ఆధార్ *esignservice.cdac.in ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు….

ఫారం-8 లో *"Correction of Entries in Existing Electoral Roll" ఆప్షన్‌ను ఎంచుకోండి.

నెక్స్ట్ క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఇందులో మీరు పేరు, జెండర్, అడ్రస్ వంటి నాలుగింటిని ఒకేసారి సవరించుకోవచ్చు. *కానీ ఒక్క ఫోన్ నెంబర్ తప్ప మిగిలిన ఆప్షన్లు ఎంచుకున్నట్లయితే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ను అందజేయాల్సి ఉంటుంది. ఇవి ఆమోదం పొందటానికి సమయం పడుతుంది. ఫోన్ నెంబర్ లింక్ మాత్రం వెంటనే అయిపోతుంది. కాబట్టి ఫోన్ నెంబర్ ఆప్షన్ మాత్రమే ఎంచుకోండి. ఇతర సవరణలు ఏమైనా ఉంటే డ్రాఫ్ట్ రోల్ జారీ అయిన తర్వాత చేసుకోవచ్చు.

*డిక్లరేషన్ విభాగంలో మీ నియోజకవర్గం పేరు ఎంటర్ చేసి, క్యాప్చా మరియు OTP వెరిఫికేషన్ పూర్తి చేయండి.

సబ్మిట్ చేయగానే వెబ్‌సైట్ *esignservice.cdac.in అనే ప్రత్యేక పోర్టల్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ ఆధార్ OTP ద్వారా ఈ-సైన్ పూర్తి చేయాలి.

నాల్గవ దశ: 2002 ఓటర్ వివరాలతో దరఖాస్తు పూర్తి

మళ్లీ ఈసీఐ నెట్ (ECINET) లోకి వెళ్లి (ఆటోమేటిక్గా రీ డైరెక్టర్ అవుతుంది), మీ వివరాలు ఎంటర్ చేయగానే, కింద *"Select one category" అనే సెక్షన్ కనిపిస్తుంది.

1. 2002 సర్వేలో మీ పేరు ఉంటే మొదటి ఆప్షన్.

2. 2002-2005 మధ్య మీ తల్లిదండ్రుల పేర్లు ఉంటే రెండో ఆప్షన్.

3. 2025-26 లిస్టులో మీ తల్లిదండ్రుల వివరాలు ఉంటే మూడో ఆప్షన్.

4. ఏవీ లేకపోతే చివరి ఆప్షన్ ఎంచుకోండి.

*మొదటి రెండు ఆప్షన్లు ఎంచుకుంటే, 2002 నాటి సీరియల్ నంబర్ మరియు బూత్ వివరాలు ఎంటర్ చేయాలి.

*చివరగా మీ వ్యక్తిగత వివరాలు, తల్లిదండ్రుల ఓటర్ కార్డు నంబర్లు ఎంటర్ చేసి, 2MB లోపు ఉన్న మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. (ఫోటో సైజును సులభంగా తగ్గించుకోవాలంటే మీ ఫోటోను వాట్సప్ ద్వారా పంపించుకుని దానిని డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీ ఫొటో సైజు తగ్గిపోతుంది)

*మీరు అప్లోడ్ చేసే ఫోటో jpg, jpeg, png ఫార్మాట్లలోనే ఉండాలి.

చివరగా *"Review" క్లిక్ చేసి, వివరాలు సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే, మళ్లీ ఈ-సైన్ (e-Sign) ప్రక్రియ (ఆటోమేటిక్ గా సంబంధిత వెబ్సైట్ కు రీ డైరెక్టర్ అవుతుంది) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్లీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగా వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిషన్ పూర్తయిన తర్వాత మీకు వచ్చే *అక్నాలెడ్జ్‌మెంట్‌ను (Acknowledgment) డౌన్‌లోడ్ చేసి భద్రపరుచుకోండి.

నోట్: ఆన్లైన్ లో ఇమ్యూనరేషన్ ఫామ్ ను సబ్మిట్ చేసే ముందు ముందుగా మీ యొక్క వివరాలు అనగా మీ ఓటర్ కార్డు నెంబర్, మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, 2002లో మీది లేక మీ తల్లిదండ్రులు లేదా బంధువుల ఓటర్ వివరాలు అనగా రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గ, పోలింగ్ బూత్ నెంబర్, పోలింగ్ బూత్ లో మీ ఓటర్ కార్డు సీరియల్ నెంబర్ వివరాలను ఒక పేపర్ పై రాసుకొని ప్రక్రియను మొదలు పెడితే సులువుగా ఉంటుంది.

గమనిక: ఒకవేళ 2002 లిస్టులో ఎటువంటి వివరాలు అందుబాటులో లేకపోతే *4 వ ఆప్షన్ ఎంచుకొని ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకు మీరు బిఎల్ఓ కు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది.

2002 లిస్ట్‌లో మీ పేరు లేదా మీ తల్లిదండ్రులు, బంధువుల వివరాలు తెలుసుకోవడం ఎలా అంటే.. https://voters.eci.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లి స్క్రీన్ పై కనిపిస్తున్న రెండవ ఆప్షన్ *“search your name in last SIR” ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఇక్కడ కనిపిస్తున్న *“Search by Elector Details” పై క్లిక్ చేయాలి.

ఇక్కడ 2002 లిస్ట్ లో మీరు లేదా మీ తల్లిదండ్రులు లేదా బంధువులు ఉన్న యొక్క రాష్ట్రాన్ని ఎంచుకొని *“Elector Full Name in last SIR” ఆప్షన్ వద్ద వారి పేరును ఎంటర్ చేయాలి. (తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగులో ఎంటర్ చేయండి. ఒకవేళ రాకపోతే పేరులో ఉన్న కొద్ది కొద్ది బాగానే ఎంటర్ చేయగా కిందిగా మీకు ఆ పేర్లలో ఉన్న వారి లిస్ట్ కనిపిస్తుంది)

*ఒకవేళ మీకు రాష్ట్రం తో పాటుగా నియోజకవర్గం తెలిస్తే దాని ఎంచుకుంటే ఇంకా సులభంగా వివరాలు తెలుస్తాయి.

Next Story