- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ ఫారం బీఎల్ఓలకు అందజేయాలి:తహసీల్దార్
by Jakkula.Mamatha |
కామారెడ్డి మండలంలోని ఓటర్లు నిర్ణీత గడువులోగా తమ ఎస్ఐఆర్ ఫారాలను నింపి బీఎల్ఓలకు అందజేయాలని కామారెడ్డి మండలం తహసీల్దార్ హిమబిందు కోరారు.

X
దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలంలోని ఓటర్లు నిర్ణీత గడువులోగా తమ ఎస్ఐఆర్ ఫారాలను నింపి బీఎల్ఓలకు అందజేయాలని కామారెడ్డి మండలం తహసీల్దార్ హిమబిందు కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(SIR) ప్రక్రియ శనివారం నాటికి 70.1 శాతం పూర్తయినట్లు తహసీల్దార్ తెలిపారు. మిగిలిన అర్హులైన ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను త్వరగా పూర్తి చేసి బీఎల్వోలకు అందజేయాలని ఆమె సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు బీఎల్వోలు ప్రత్యేక బృందాలుగా ఇంటింటికి వెళ్లి ఫారాలను సేకరిస్తున్నారని చెప్పారు. ఆయా పోలింగ్ స్టేషన్‌లోని బూతులలో ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను నిర్ణీత గడువులోగా నింపి త్వరగా అందజేయాలని ఓటర్లను కామారెడ్డి తహసీల్దార్ కోరారు.
Next Story






