- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి:జిల్లా కలెక్టర్
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కోడేరు మండలం పస్పుల గ్రామంలో కొనసాగుతున్నఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ, కోడేరు: కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కోడేరు మండలం పస్పుల గ్రామంలో కొనసాగుతున్నఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలోని డిజిటలైజేషన్ కేంద్రాలను సందర్శించి, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) నిర్వహిస్తున్న డిజిటలైజేషన్ పనులను నిశితంగా పరిశీలించారు. ఓటర్ల వివరాలు నమోదు, మ్యాపింగ్, పెండింగ్ దరఖాస్తులు, వలస వెళ్లిన ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాల నమోదుపై అధికారులను ప్రశ్నించి పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి ఓటరు వివరాలను పూర్తి స్థాయిలో ధృవీకరించి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆయన సూచించారు. గ్రామంలోని 71వ పోలింగ్ కేంద్రంలో మొత్తం 1,116 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 938 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేసి 84 శాతం ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
అలాగే 72వ పోలింగ్ కేంద్రంలో మొత్తం 852 మంది ఓటర్లు ఉండగా, 727 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేసి 85 శాతం ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. ఈ వివరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, మిగిలిన ఓటర్ల సమాచారాన్ని వేగంగా నమోదు చేసి నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇంకా ఎంత మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్‌లో ఉందని, దీర్ఘకాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు నమోదు చేశారా, మరణించిన ఓటర్ల వివరాలను ఎన్నికల నిబంధనల ప్రకారం తొలగించేందుకు అవసరమైన ఆధారాలను సేకరించారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ పెండింగ్‌లో ఉన్న వివరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
వలస వెళ్లిన ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి వారి వివరాలను సేకరించాలని, అవసరమైతే కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం పొందాలని కలెక్టర్ సూచించారు. మరణించిన ఓటర్లకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను సేకరించి ఎన్నికల నిబంధనల ప్రకారం నమోదు చేయాలని, ఎటువంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా పూర్తి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియలో ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని, ప్రతి నమోదును మరోసారి పరిశీలించిన అనంతరం మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని బీఎల్‌వోలకు సూచించారు.
డిజిటలైజేషన్ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయరాదని, పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువైన ఆగస్టు 3వ తేదీలోగా 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తూ లక్ష్య సాధన దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ జమీల్,ఆర్.ఐ సురేందర్ , పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు.






