ఉప సర్పంచుల హక్కుల కోసం ‘ఛలో కలెక్టరేట్’

by Kodari Anjali |

ఉప సర్పంచుల హక్కుల సాధన కోసం రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం పిలుపు మేరకు మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఉప సర్పంచుల హక్కుల కోసం ‘ఛలో కలెక్టరేట్’
X

దిశ, జనగామ: ఉప సర్పంచుల హక్కుల సాధన కోసం రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం పిలుపు మేరకు మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉప సర్పంచులు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించి, తమ సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏవో రవికిరణ్‌కు అందజేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పండుగ హరీష్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఉప సర్పంచులకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఉప సర్పంచుల పేర్లను తప్పనిసరిగా చేర్చాలని, గ్రామపంచాయతీ తీర్మానాలపై సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా సంతకం చేసే అధికారాన్ని కల్పించాలని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు...

అదేవిధంగా మండల స్థాయి సర్వసభ్య సమావేశాలకు ఉప సర్పంచులను అధికారికంగా ఆహ్వానించడంతో పాటు, గ్రామపంచాయతీల్లో స్టాండింగ్ కమిటీ వైస్ చైర్మన్‌గా ఉప సర్పంచ్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఉప సర్పంచుల హక్కులు పూర్తిస్థాయిలో సాధించే వరకు ఉద్యమాన్ని నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర శంకర్ నాయక్, అఖిల వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, నాగపురి కిషన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిడుగు మహేష్, కార్యదర్శి పుప్పాల కరుణాకర్ కుమార్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ రాజిరెడ్డి, మండల అధ్యక్షులు ఎడ్ల బాలు, తిరుపతిరెడ్డి, ఆరూరి మాధవ్, నరేందర్, మూల కిరణ్ గౌడ్, చిలువేరు మహేందర్, గోవింద్ ఇసాక్, గాదె శాంత భాస్కర్, చింత నరేష్, వార్డ్ మెంబర్ల జిల్లా కన్వీనర్ కుంటి రాజు, ఉప సర్పంచులు సంపత్ రెడ్డి, కిరణ్ స్వామి, బక్క సరిత, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా ఉప సర్పంచులందరికీ పండుగ హరీష్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story