- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలాంటి స్టోరీలు రావాలని ఎంతో ఎదురుచూశా.. ఇప్పటి తరానికి ఇది బాగా కనెక్ట్ అవుతుంది: నాగచైతన్య
కరోనా మహమ్మారి తర్వాత టాలీవుడ్‌లో సరిగ్గా మంచి ప్రేమకథా చిత్రాలు రావడం లేదని తాను చాలా భయపడినట్లు నాగచైతన్య చెప్పారు.

దిశ, సినిమా: ‘క’సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’తో వచ్చి అందరినీ కన్నీరు పెట్టిస్తున్నారు. శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. సాయి రాజేష్, ఎస్.కె.ఎన్ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను స్వీకరించారు. జూలై 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తోదూసుకుపోతోంది. ప్రతి ఒక్కరి పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఈ కథ అందరి హృదయాలకు హత్తుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత టాలీవుడ్‌లో సరిగ్గా మంచి ప్రేమకథా చిత్రాలు రావడం లేదని తాను చాలా భయపడినట్లు నాగచైతన్య చెప్పారు.
అసలు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి లవ్ స్టోరీలు చూస్తారా లేదా అనే అనుమానాలు కూడా తనకు కలిగాయని, అయితే ఈ సినిమాతో మళ్లీ ఆ ట్రెండ్ ప్రారంభమైందని తెలిపారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ రూపంలో ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించినందుకు చిత్ర బృందాన్ని ఆయన ఎంతగానో ప్రశంసించారు. ఇప్పటివరకు ఇద్దరు ప్రేమించుకోవడం లేదా పెళ్లి చేసుకోవడం లాంటి కథలనే ఎక్కువగా చూశామని, కానీ ఒక బ్రేకప్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చాలా సహజంగా చూపించారని నాగచైతన్య పేర్కొన్నారు. ఈనాటి యువతకు ఇది చాలా బాగా కనెక్ట్ అయ్యే కథ అని, ఇలాంటి మంచి స్టోరీలు రావాలని తాను ఎంతగానో ఎదురుచూశానని తెలిపారు. అలాగే హీరో కిరణ్ అబ్బవరం సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని మెచ్చుకున్నారు. హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ కెరీర్‌లో ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిపోతుందని చైతూ ప్రశంసించారు.






