- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటింటికీ వెళ్లి ఈ-కేవైసీ నమోదు
రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవాలని ప్రభుత్వం సూచించినప్పటికీ, ఇంకా పలువురు స్పందించడం లేదని రేషన్ డీలర్లు తెలిపారు.

దిశ, నిజాంసాగర్ : రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవాలని ప్రభుత్వం సూచించినప్పటికీ, ఇంకా పలువురు స్పందించడం లేదని రేషన్ డీలర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి, సుల్తాన్‌నగర్ గ్రామపంచాయతీల పరిధిలో మంగళవారం రేషన్ డీలర్ సయ్యద్ ఖాజా మొయినోద్దీన్ ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల ఈ-కేవైసీ వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిరంతరం పొందేందుకు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు ఉమ్మడి జిల్లా పరిధిలోని స్వగ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నిజాంసాగర్‌లోనే రేషన్ డీలర్‌ను సంప్రదించి స్థానికంగా ఈ-కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమయం, ప్రయాణ వ్యయం ఆదా అవుతోందన్నారు.
రేషన్ డీలర్ సయ్యద్ ఖాజా మొయినోద్దీన్ మాట్లాడుతూ.. ఈ-కేవైసీకి జూలై 31వ తేదీ వరకు మాత్రమే గడువు ఉన్నందున ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని కోరారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే ఈ-కేవైసీ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బయటకు రాలేని లబ్ధిదారుల కోసం ఇంటింటికీ వెళ్లి ఈ-కేవైసీ నమోదు చేస్తున్నామని, ప్రజలందరూ సహకరించి ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






