- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంట కాల్వల అభివృద్ధికి రూ. 31 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గన్ పూర్ రిజర్వాయర్ పంట కాల్వల అభివృద్ధికి నాలుగు కాల్వలకు 31 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే తెలిపారు.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: గన్ పూర్ రిజర్వాయర్ పంట కాల్వల అభివృద్ధికి నాలుగు కాల్వలకు 31 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. మంగళవారం గన్ పూర్ రైతు వేదికలో రైతు నేస్తం 100 ఎపిసోడ్స్ పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుండి పాల్గొన్న కార్యక్రమంలో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయ్యాక 12 నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉందని, నీటి లభ్యతపై స్పష్టత లేని పరిస్థితిలో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
సాగునీరు సమస్యలు తలెత్తకుండా..
నీటి ఆధారిత పంటలకు బదులుగా తక్కువ నీటితో పండే పెసర్లు, కందులు, కూరగాయలు, వంటి పంటలను సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.గతంలో మక్క పంటకు ప్రభుత్వం మంచి ధర కల్పించి రైతులకు లాభాలు చేకూర్చిందని, ఎకరాకు రూ.1 లక్షకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. బ్రోకర్ల దోపిడీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేశామని అన్నారు. అదేవిధంగా, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నీటిని దేవాదుల ద్వారా 44,000 ఎకరాలకు చేరేలా చర్యలు చేపట్టామని, గన్పూర్ చెరువు అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు మంజూరు చేయించామని వివరించారు. రెండు జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకొని తాగునీరు, సాగునీరు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారి బాబురావు, ఏ డి ఏ రమేష్, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీవో భాస్కర్, తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక శాస్త్ర వేత్త డా విశ్వతేజ, సర్పంచ్సింగిల్ విండో చైర్మన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






