- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ వాసులకు బిగ్ రెయిన్ అలర్ట్. నగరంలో మరికాసేపట్లో భారీ వాన పడనుందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేసారు. కాగా ఇప్పటికే బాచుపల్లి, మేడ్చల్, అల్వాల్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్ లో భారీ ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. ఈ వర్షం మరికొద్దిసేపట్లో నగరం అంతటా విస్తరించనుందని సమాచారం. మరో గంటలో నగరంలో భారీ వర్షం దంచి కొట్టనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉద్యోగులు, విద్యార్థులు త్వరగా ఇళ్లకు చేరుకోవాలని, వర్షం వలన ఏర్పడే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కునే అవకాశం ఉందని తెలిపారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story






