రాహుల్ గాంధీ ధర్నాతో సీజేపీ ఉద్యమం పీక్స్ కు: మంత్రి శ్రీధర్ బాబు

by Prasad Jukanti |

జెన్ జీ తో పోటీ పడే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదని మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు.

రాహుల్ గాంధీ  ధర్నాతో సీజేపీ ఉద్యమం పీక్స్ కు: మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: యువకుడిలా ఆలోచించే శక్తి సీఎం రేవంత్ దగ్గర ఉందని, జెన్ జీ తో పోటీ పడే ఆలోచన ముఖ్యమంత్రిదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మా NSUI, యూత్ కాంగ్రెస్ నేతల్లో 90 శాతం జెన్ జీలే ఉన్నారని చెప్పారు. ఇవాళ మీడియాతో చిట్‍చాట్‍లో మాట్లాడిన ఆయన.. విద్యార్థుల నిరసన కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. నీట్ అనేది కోట్లాది విద్యార్థులు సమస్య అని, మధ్య తరగతి కుటుంబాలు సైతం ఈ నిరసనలో పాల్గొన్నారని చెప్పారు. కాక్రోచ్ పార్టీ ఆన్‍లైన్ ఉద్యమం మొదలు పెట్టిందని ఆ పార్టీ నినాదాన్ని బలంగా తీసుకెళ్లింది రాహుల్ గాంధీ అని చెప్పారు. నిరసన ఉద్యమం విస్తరించడానికి కారణం కాంగ్రెస్ అని, రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయడంతో ఉద్యమం పీక్స్ కి వెళ్ళిందన్నారు. మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‍కు సన్మానం చేయడం బీజేపీ మనస్తత్వాన్ని తెలియచేసిందన్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై స్పందిస్తూ ఎవరు మంత్రులు కావాలో డిసైడ్ చేసేది ఏఐసీసీ అని స్పష్టం చేశారు.

పీఆర్ స్టంట్‍తో బీఆర్ఎస్ గతి ఏమైంది?:

తుమ్మిడి హట్టిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరుగుతున్నాయని త్వరలోనే సీఎంతో చర్చలు జరుపుతామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చలు చేసి ముందుకు వెళ్తామని చెప్పారు. మేం పని చేసుకుంటూ వెళ్తాం ప్రమోషన్ గురించి మేం పట్టించుకోబోమన్నారు. ప్రమోషన్స్, పీఆర్ స్టంట్ చేసుకుంటూ వెళ్లిన బీఆర్ఎస్ పని ఏమైందో చూశామని పనికి మాలిన వాళ్ళు ఏదేదో అంటూనే ఉంటారన్నారు. బెంగుళూరు కంటే ఎక్కువ గ్లోబల్ కెపాబులిటీ సెంటర్స్ హైదరాబాద్ వస్తున్నాయని ఇది మా ప్రభుత్వ విజయం అన్నారు. ఈ ఏడాది 100 కంపెనీలు రావాలని టార్గెట్ పెట్టుకున్నామని అందులో ఇప్పటికి 40 వచ్చాయని చెప్పారు.

హైడ్రాపై బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు:

హైడ్రా మంచిదని సాధారణ ప్రజలు చెబుతున్నారని హైడ్రాకు మద్దతుగా ప్రజలు ర్యాలీ తీస్తున్నారన్నారు. హైడ్రా విషయంలో కోర్టు తీర్పును గౌరవిస్తామని, మేం చెప్పాల్సింది కోర్టుకు చెప్తామన్నారు. రాజకీయం కోసమే వ్యతిరేకమైన పిటిషన్లు వేస్తున్నారని హైడ్రాకు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కోర్టు పూర్తి తీర్పు ఇంకా రాలేదని మీడియాలో, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తోందన్నారు.

Next Story