ఒడిశా నుంచి సికింద్రాబాద్‌కు గంజాయి అక్రమ రవాణా భగ్నం.. 6.096 కిలోల గంజాయి స్వాధీనం

by Taduka Kalyani |

సికింద్రాబాద్ రైల్వే పోలీసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఒడిశా నుంచి సికింద్రాబాద్‌కు గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 6.096 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా నుంచి సికింద్రాబాద్‌కు గంజాయి అక్రమ రవాణా భగ్నం.. 6.096 కిలోల గంజాయి స్వాధీనం
X

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే పోలీసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఒడిశా నుంచి సికింద్రాబాద్‌కు గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 6.096 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3,04,800గా పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రంలోని సుందర్‌గఢ్ జిల్లా రౌర్కెలాకు చెందిన అంతర్యాని మహానంద (23) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఉపాధి సరిపోకపోవడంతో హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయని తెలుసుకుని ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నెల 26న రాయగడ అటవీ ప్రాంతానికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి సుమారు 6 కిలోల గంజాయిని కిలోకు రూ.5 వేల చొప్పున కొనుగోలు చేశాడు. అనంతరం రెండు సంచుల్లో గంజాయిని ప్యాక్ చేసి కేసింగా రైల్వే స్టేషన్‌లో నాగావళి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కి హైదరాబాద్‌కు బయలుదేరాడు. 27న ఉదయం చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో దిగిన నిందితుడు తన బంధువు కోసం వెయిటింగ్ హాల్‌లో వేచి ఉండగా, అనుమానాస్పదంగా కనిపించడంతో జిఆర్పి, ఆర్పిఎఫ్ సంయుక్త బృందం తనిఖీ చేసి గంజాయిని స్వాధీనం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 388/2026గా ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన జిఆర్పి, ఆర్పిఎఫ్ అధికారులను రైల్వే పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి తగిన రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.

Next Story