‘ఆకాశంలో ఒక తార’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల.. దుల్కర్ సల్మాన్ రోల్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్!

by Mallepaka Hamsa |

ఇక విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్ టీషర్ట్, భుజంపై టవల్, లుంగీ కట్టుకుని పక్కా మధ్యతరగతి యువకుడి లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు.

‘ఆకాశంలో ఒక తార’ నుంచి  స్పెషల్ పోస్టర్ విడుదల.. దుల్కర్ సల్మాన్ రోల్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్!
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘ఆకాశంలో ఒక తార’ మూవీ మేకర్స్ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. దాంతో పాటు చిత్రంలోని మొదటి పాట ‘చిట్టి చిట్టి చీమ’ను కూడా ఈ రోజే విడుదల చేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు తీపి కబురు అందించారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ ‘స్వప్న సినిమాస్’ తమ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "ఈ రోజు మేము దుల్కర్‌లో ఉన్న చిరునవ్వు, ఆప్యాయత, మ్యాజిక్‌ను ఘనంగా వేడుక చేసుకుంటున్నాము. ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర బృందం వైపు నుంచి మా 'కృష్ణ'కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు మేము మొదటి పాటను కూడా మీ ముందుకు తీసుకువస్తున్నాము" అని రాసుకొచ్చారు.

ఇక విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్ టీషర్ట్, భుజంపై టవల్, లుంగీ కట్టుకుని పక్కా మధ్యతరగతి యువకుడి లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దుల్కర్‌ను ఈ యాంగిల్‌లో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆకాశంలోకి, అంతరిక్షంలోకి వెళ్లాలని పెద్ద కలలు కనే ఒక గ్రామీణ అమ్మాయి కథాంశంతో ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు. సందీప్ గున్నం, రమ్య గున్నం లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ చిత్రానికి రెండుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Next Story