- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ముగిసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం.. ఉత్తర్వులు జారీ
రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిపోయింది. డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం, వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పదవీకాలం సోమవారంతో ముగియడంతో తాజాగా శాసనమండలి ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిపోయింది. డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం, వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పదవీకాలం సోమవారంతో ముగియడంతో తాజాగా శాసనమండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీ అయిన ఈ స్థానాలకు కొత్త అభ్యర్థులను టీడీపీ నుండే నామినేట్ చేయనున్నారు. దీంతో ఎమ్మోల్సీ పదవి కోసం పార్టీలో పోటీ పెరిగిపోయింది. ఈ రెండు ఖాళీల కోసం ఏకంగా 20మందికి పైగా నేతలు పోటీపడుతున్నారు.
గతంలో సీట్లు ఆశించి భంగపడినవాళ్లు, రాజ్యసభ అవకాశం మిస్ అయిన సీనియర్లు ఇప్పటికే అధినేత చంద్రబాబును ప్రసతన్నం చేసుకుని వినతులు అందజేస్తున్నట్టు తెలుస్తోంది. ఆశావహుల్లో కృష్ణా జిల్లా నేతలే ఎక్కవగా ఉన్నట్టు తెలుస్తోంది. పోటీపడుతున్నవారిలో ముఖ్యనేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య, వంగవీటి రాధా, టీడీ జనార్ధన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్ధా వెంకన్న లాంటి పేర్లు సైతం ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రధాని భోగాపురం విమానాశ్రయానికి రాబోతున్న నేపథ్యంలో ఆయన పర్యటన తరవాతనే చంద్రబాబు ఎమ్మెల్సీ పదవులపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.






