- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిలావర్‌పూర్ మండలంలో డీపీఓ ఆకస్మిక తనిఖీ
మండలంలో నిర్మల్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు.

దిశ, దిలావర్‌పూర్: మండలంలో నిర్మల్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి రోజువారీ ప్రగతి నివేదికను పరిశీలించారు. మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి డాక్టర్ ప్రియాంకతో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి చర్చించారు. మండలంలో ఇప్పటివరకు అటువంటివి ఏమైనా నమోదైయ్యాయని ఆరా తీశారు. ట్రేడ్ లైసెన్స్ కలిగిన షాపులను పరిశీలిస్తూ ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోవాలని దానికి క్రమం తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. కిరాణా షాపులలో సింగిల్ ప్లాస్టిక్ వాడొద్దని దాని ద్వారా అనర్ధాలు జరుగుతాయని ప్లాస్టిక్ వాడితే దుకాణం యాజమానులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
దిలావర్‌పూర్‌లో పలు కాలనీలలో పర్యటిస్తూ పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా పంట గుంటలు ఏర్పాటు చేసుకోవాలని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని దానిద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని ప్రజలకు అవగాహన కల్పించారు. లోలం గ్రామంలో పర్యటిస్తూ డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. చుట్టుపక్కల ఎక్కడ కూడా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. ఎక్కడైనా పాడైపోయిన నీటి తొట్టిలో నీరు నిల్వ ఉన్నట్లయితే మలేరియా డెంగీ జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణ రాణి,ఎంపీవో గోవర్ధన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ ప్రియాంక పంచాయతీ కార్యదర్శులు ఆశా వర్కర్లు స్థానిక రాజకీయ నాయకులు పాల్గొన్నారు.






