భూపాలపల్లిలో ఉద్రిక్తత.. కేటీకే 5 గని వద్ద కల్వకుంట్ల కవితను అడ్డుకున్న సింగరేణి సెక్యూరిటీ!

by Jakkula.Mamatha |

భూపాలపల్లిలో శనివారం జరిగే బాయిబాట కార్యక్రమానికి విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కేటి కే5 వద్ద మైన్‌ లోపలికి వెళ్లకుండా సింగరేణి సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నారు.

భూపాలపల్లిలో ఉద్రిక్తత.. కేటీకే 5 గని వద్ద కల్వకుంట్ల కవితను అడ్డుకున్న సింగరేణి సెక్యూరిటీ!
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: భూపాలపల్లిలో శనివారం జరిగే బాయిబాట కార్యక్రమానికి విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కేటి కే5 వద్ద మైన్‌ లోపలికి వెళ్లకుండా సింగరేణి సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నారు. సెక్యూరిటీ టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో గేటు తీసేసి కవిత మైన్ లోపలికి వెళ్లారు. అంతకుముందు కవిత భూపాలపల్లికి రాగానే భూపాలపల్లి అంబేద్కర్ జంక్షన్ వద్ద టీఆర్ఎస్ నాయకులు ఎచ్ఎంఎస్ కార్మికులు, ఘన స్వాగతం పలికారు. కేటి కే 5 ఇంక్లైన్ గనికి చేరుకున్న కవిత గని లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు టీఆర్ఎస్ కార్యకర్తలకు, కార్మికులకు తోపులాట జరిగింది. అనంతరం మైన్ గేట్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్న నాయకులు, గేట్‌ను తీసివేయడంతో మైన్ లోపలికి ప్రవేశించారు.

Next Story