చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు.. ప్రశంసల వర్షం కురిపించిన బాబా రాందేవ్

by Naga Rani Yarlagadda |

ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఉండవల్లి గుహల వద్ద రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది.

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు.. ప్రశంసల వర్షం కురిపించిన బాబా రాందేవ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఉండవల్లి గుహల వద్ద రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు యోగా గురుగా పేరొందిన గురు రాందేవ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. బాబా రాందేవ్.. సీఎం కు వివిధ రకాల యోగా ప్రక్రియలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఈ వయస్సులో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని కొనియాడారు. అభివృద్ధి, విజన్ కలిగిన సీఎం అంటూ.. కితాబిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా.. సీఎం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రధాని మోదీ కృషి చేస్తోంటే.. భారత్ ను విశ్వగురుగా నిలపాలన్న ప్రధాని కృషికి చంద్రబాబు తోడయ్యారన్నారు. చంద్రబాబు తరహాలో ప్రతి సీఎం పనిచేస్తో వికసిత్ భారత్ 2047 లక్ష్యం ముందుగానే సాకారమవుతుందని బాబా రాందేవ్ ఆశించారు. దేవతల రాజధాని అమరావతి.. ఇప్పుడు యోగా రాజధాని అయిందన్నారు. చంద్రబాబు ప్రకృతి, సాంస్కృతిక, యోగా ప్రేమికుడు మాత్రమే కాదని, ఆయన సర్వజన ప్రేమికుడని ప్రశంసించారు.

సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. యోగా సాధనతో రాందేవ్ బాబా అద్భుతాలు సృష్టిస్తున్నారని కొనియాడారు. రాందేవ్ బాబా శిక్షణలో యువత చేస్తున్న యోగాసనాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, యోగాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది రాందేవ్ బాబానే అన్నారు. ప్రస్తుత సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉందని, ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత చాలా అవసరమని సీఎం పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయన్నారు. త్వరలో దేశానికి ఆధ్యాత్మిక హబ్ గా ఏపీ మారనుందని తెలిపారు. పర్యవరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, రాష్ట్రంలో 50 శాతం పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

Next Story