సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్..!

by Mallepaka Hamsa |

ప్రశంసలు దక్కించుకుంటున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా మాత్రం లాభాలను రాబట్టలేకపోతోంది. ఇలాంటి విచిత్రమైన పరిస్థితిలో ఈ సినిమాకు మద్దతుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగారు.

సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్..!
X

దిశ, సినిమా: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో, దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ కల్ట్ క్లాసిక్ మూవీ ‘సింగ్ గీతం’. జూన్ 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుండి భారీ ప్రశంసలు అందుకుంటోంది. సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా మేకింగ్‌కు ఫిదా అయిపోతున్నారు. అయితే, ఒక ప్యూర్ కల్ట్ క్లాసిక్‌గా ప్రశంసలు దక్కించుకుంటున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా మాత్రం లాభాలను రాబట్టలేకపోతోంది. ఇలాంటి విచిత్రమైన పరిస్థితిలో ఈ సినిమాకు మద్దతుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగారు. మూవీ ప్రమోషన్స్ పెంచి కలెక్షన్లు రాబట్టేందుకు నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ ఒక ప్రత్యేకమైన 5 నిమిషాల వీడియోలో సందడి చేశారు.

ఎంతో ఫన్నీగా సాగిన ఈ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో మొదట నాగ్ అశ్విన్ ‘సింగ్ గీతం’ సినిమా గురించి అడగ్గా, ప్రభాస్ ఏం చెప్పాలా అని కాస్త కంగారు పడతాడు. ఆ తర్వాత అప్పటికప్పుడు సినిమా చూసేసి నేరుగా నాగ్ అశ్విన్‌కే ఫోన్ చేస్తాడు. "అసలు ఇంత మంచి సినిమాలో నన్ను ఎందుకు తీసుకోలేదు?" అంటూ ప్రభాస్ చాలా సీరియస్‌గా నాగ్ అశ్విన్‌ను ప్రశ్నించడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సినిమాలోని విశేషాలను సరదాగా పంచుకున్నారు. ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే చూసి ఆదరించాలని ప్రభాస్ ప్రేక్షకులను కోరారు. డార్లింగ్ ప్రభాస్ ఇచ్చిన ఈ సడెన్ సర్‌ప్రైజ్ ప్రమోషనల్ వీడియోతో అటు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Next Story