‘బుగ్గపాడు భూ దోపిడీ పై విచారణ జరిపించాలి’.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్

by Jakkula.Mamatha |

ఖమ్మం జిల్లా బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లో జరిగిన భూ దోపిడీపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

‘బుగ్గపాడు భూ దోపిడీ పై విచారణ జరిపించాలి’.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్
X

దిశ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లో జరిగిన భూ దోపిడీపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మార్కెట్ విలువకు విరుద్ధంగా అనుయాయుల కంపెనీకి ఫుడ్ పార్క్ భూములు విక్రయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవినీతి, అక్రమాలపై పారదర్శకంగా దర్యాప్తు చేయాలని అన్నారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా సీతారామ ప్రాజెక్టు కాలువ మట్టిని, కలపను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని పువ్వాడ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ప్రతి భూ దందాల్లో, మట్టి, ఇసుక మాఫియా వెనుక మంత్రులు పాత్ర ఉందని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫుడ్ పార్క్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు.

Next Story