- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సవాలే లేదు బట్టలిప్పి పరుగెత్తిస్తా.. కేటీఆర్ పై మైనంపల్లి సెన్సేషనల్ కామెంట్స్
నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడితే కుదరదని, బిడ్డా కాస్కో.. మీకు ముందు ముందు ఇంకా చాలా సినిమా చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే, మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. కేటీఆర్ విపక్షంలోనూ అట్టర్ ప్లాప్ అయ్యారని, కేటీర్ ప్రతిదానికి ఎందుకు అంతలా ఉలిక్కిపడుతున్నావ్ అంటూ ప్రశ్నించారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న మల్కాజిగిరి నియోజకవర్గం పర్యటన సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పనులను అడ్డుకోవమే కేటీఆర్, హరీశ్ రావు పనిగా పెట్టుకున్నారని ధాన్యం సేకరణ విషయంలో ఈ ఇద్దరూ లారీలను అడ్డుకున్నారని ఆరోపించారు. అమెరికా నుంచి నేరుగా వచ్చి పదవులు అనుభవిస్తున్న కేటీఆర్ సిరిసిల్ల ఉద్యమాకారుడి నోట్లో మట్టికొట్టాడని విమర్శించారు.
సెలబ్రిటీల జీవితాలను నాశం చేశావ్:
కేటీఆర్ దండుపాళ్యం బ్యాచ్ అని మాట్లాడుతున్నాడు.. దండుపాళ్యం బ్యాచ్, స్టూవర్టుపురం దొగలకైనా మినిమం ఎథిక్స్ ఉంటాయి. మీకులా వారు సొంత చెల్లి, బావ, రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయించరని, కేటీఆర్ సెలబ్రెటీల ఫోన్లు ట్యాప్ చేసి వారి జీవితాలను నాశనం చేశాడని ఆరోపించారు. మేం రౌడీయిజం చేసేటోళ్లం కాదని రౌడీలకు బుద్ధి చెబుతూ హీరోయిజం చేసేటోళ్లం అన్నారు. సవాలే లేదని బట్టలిప్పి పరుగెత్తిస్తామన్నారు. మైనంపల్లి మాటల మనిషి కాదని చేతల మనిషి అని చెప్పారు. మల్కాజిగిరికి వస్తానంటున్నావ్ నేను సిరిసిల్లాకు రాలేనా అని ప్రశ్నించారు.
అర్ధరాత్రి పోలీసులకు దొరికిన చరిత్ర నీది:
మంత్రి హోదాలో గన్ మెన్లు ఎవరూ లేకుండా అర్థరాత్రి ఒంటరిగా వెళ్తుండగా అప్పా జెంక్షన్‍లో ముఖానికి మాస్క్ పెట్టుకుని దొరికిన ఘనత కేటీఆర్ ది అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని పోలీసు డిపార్ట్ మెంట్ చర్చించుకుందన్నారు. మేము దొంగతనం చేయడం లేదని హీరోయిజం చేస్తున్నామని, ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. ప్రభుత్వంలో ఉన్నామనే ఓపికతో వెళ్తున్నామని అదే మేము తలుచుకుంటే ఒక్క రోజు కూడా నిద్రపోలేవని ఫైర్ అయ్యారు. ఇంగ్లీశ్ మాట్లాడటంలో కేటీఆర్ తనకు తానే తోపు అనుకుంటున్నాడని కానీ మెజారిటీ మంత్రుల్లో ఆయనకంటే మంచి ఇంగ్లీశ్ మాట్లాడేవారు ఉన్నారన్నారు.






