యూరియా యాప్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

by Jakkula.Mamatha |

నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ కలిసి యూరియా యాప్‌ను ప్రారంభించారు.

యూరియా యాప్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
X

దిశ,కనగల్: నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ కలిసి యూరియా యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన ఎరువుల పంపిణీ, నిల్వలు మరియు ఇతర వివరాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడంలో యూరియా యాప్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రైతులు యాప్‌ను ఉపయోగించి ఎరువుల లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది మరియు ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story