- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజినీకాంత్-కమల్ హాసన్ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్..
ను ఈ మధ్యనే మా నాన్నగారిని, రజినీకాంత్ సార్‌ను కలిశాను. కానీ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను.. నేను ‘KHxRK’ చిత్రంలో నటించడం లేదు.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఒకవైపు విలక్షణమైన పాత్రలతో అలరిస్తూనే.. మరోవైపు ఐటమ్ సాంగ్స్‌లోనూ మాస్ స్టెప్పులతో బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. గత ఏడాది ‘కూలీ’ మూవీతో మెప్పించిన.. ఆమె ఇటీవల ‘పెద్ది’లో ఐటమ్ సాంగ్ చేసి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఫుల్ ఫామ్‌లో ఉన్న శృతి ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ మూవీతో పాటు.. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘సలార్-2’ భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, శృతి హాసన్ ఖాతాలోకి ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ వచ్చి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో, లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో రాబోతున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ పవర్‌ఫుల్ కాంబినేషన్‌గా వస్తున్న ‘KHxRK’ సినిమాలో కమల్ హాసన్ కూతురైన శృతి హాసన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోందని పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఈక్రమంలో.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. "నేను ఈ మధ్యనే మా నాన్నగారిని, రజినీకాంత్ సార్‌ను కలిశాను. కానీ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను.. నేను ‘KHxRK’ చిత్రంలో నటించడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. అయినప్పటికీ, మిగతా అందరిలాగే నెల్సన్ సార్ ఈ సినిమా కోసం ఎలాంటి అద్భుతాలను సిద్ధం చేశారో, స్క్రీన్‌పై ఎలాంటి కొత్త అంశాలను చూపించబోతున్నారో చూడాలని నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని స్పష్టం చేశారు. ఇక రజినీకాంత్ గురించి మాట్లాడుతూ.. ‘‘ సూపర్ స్టార్ ‘కూలీ’ సినిమాకు పనిచేసిన తర్వాత, వ్యక్తిగతంగా నేను రజినీ సార్‌కు చాలా పెద్ద అభిమానిగా మారిపోయాను. ఇప్పుడు ఇండియన్ మూవీకి చెందిన ఇద్దరు దిగ్గజాలైన మా నాన్నగారిని, రజినీ సార్‌ను వెండితెరపై ఒకేసారి కలిసి చూడబోతున్నాం. కాబట్టి ఈ సినిమా చిత్ర పరిశ్రమకు ఒక నిజమైన పండుగలా ఉండబోతోంది" అంటూ శృతి హాసన్ ఎంతో ఉత్సాహంగా చెప్పుకొచ్చారు.






